బీజీపీలో విలీనం కానున్న తెలంగాణ పార్టీ
యువ తెలంగాణ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయనున్నారు
యువ తెలంగాణ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయనున్నారు. ఈ నెల 16వ తేదీన బీజేపీలో తమ పార్టీని విలీనం చేయనున్నట్లు ఆ పార్టీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమలు తెలిపారు. యువ తెలంగాణ పేరిట తెలంగాణలో పార్టీని స్థాపించారు జిట్టా బాలకృష్ణారెడ్డి. అయితే ఏ ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేదు.
టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా....
అయితే టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తాము పార్టీని పెట్టామని, కేసీఆర్ ను అందరం కలసి ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైందని జిట్టా బాలకృష్ణారెడ్డి తెలిపారు. అందుకే బీజేపీలో తమ పార్టీని విలీనం చేయనున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో ఈ విలీన కార్యక్రమం జరగనుంది.