స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్.. స్వాట్ అని కూడా అంటారు. నిరసనల సమయంలో మహిళలను అదుపులోకి తీసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మహిళల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ఉండేందుకు హైదరాబాద్ పోలీసులు స్వాట్ పేరుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వివిధ అంశాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న ఈ బృందాలను నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు.
తొలి దశలో 35 మందిని స్వాట్ కోసం ఎంపిక చేశారు. వీరికి పోలీసులతో పాటు మార్షల్ ఆర్ట్స్, మాబ్ కంట్రోల్ ఎక్స్‌పర్ట్స్‌తో 45 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. మహిళలతో పాటు ఇతర నిరసనకారులను అదుపు చేయడం, ఆయుధం లేకుండా శత్రువుతో పోరాడటం, నిరసనల సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడం తదితర అంశాల్లో ట్రైనింగ్ ఇచ్చారు.