స్టాండ్ వేసి సైకిల్ తొక్కినట్లుగా ఫోన్ ట్యాపింగ్ కేసు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు

Update: 2026-02-02 07:39 GMT

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. కేసులో ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడూ ఇవన్నీ ఎదుర్కోవాల్సిందేనని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న పెట్టుబడులన్నీ కట్టుకథలేనని అన్నారు. వేల కోట్ల ఎంవోయూలు చేసుకున్న కంపెనీలకు కనీసం వెబ్ సైట్ దిక్కులేదని కవిత అన్నారు. వీటిపై తాను చేసిన రీసెర్చ్ లో చాలా కంపెనీల గుట్టు బయటపడిందన్నారు. హ్యాష్ ట్యాగ్ కాంగ్రెస్ ఫేక్ ఎంవోయూ ల పేరుతో తెలంగాణ యువత ఉద్యమం చేయాలని, హైదరాబాద్ లో అగ్నిప్రమాదాలు, నేరాలు పెరిగితే సీఎం ఏం చేస్తున్నట్లు?అని ప్రశ్నించారు.

మున్సిపల్ ఎన్నికల్లో...
అభ్యర్థి చెడ్డోడైనా కేసీఆర్ ను చూసి ఓటు వేయాలని కేటీఆర్ కోరుతున్నారని, కేసీఆర్ ను విచారణకు పిలవటమే నేరమని ఆయన అంటున్నారు. ఇలాంటి రాచరిక, నియంతృత్వ పోకడలను మార్చుకోకుంటే బీఆర్ఎస్ ను ఎవరు కాపాడలేరన్నారు. గుంటనక్క తో కాంగ్రెస్ ప్రభుత్వం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంన్న కవిత ఫోన్ ట్యాపింగ్ కేసును పారదర్శకంగా విచారించి తుది దశకు తెస్తారన్న నమ్మకం లేదన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారన్న కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డి 30 సార్లు ఢిల్లీ కి పోయి మోడీ ని కలిసిన సరే 30 వేల కోట్లు తేలేదని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో మంచి అభ్యర్థికి ఓటు వేయాలని, జాగృతి తరఫున ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నామన్న కవిత ఫోన్ ట్యాపింగ్ కేసు సైకిల్ స్టాండ్ వేసి తొక్కినట్లుగా పరిస్థితి ఉందని అన్నారు.


Tags:    

Similar News