తెలంగాణలో జూన్ 26 వరకు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలోని వివిధ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ
జూన్ 26 వరకు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ విభాగం అంచనా వేసింది. పిడుగులతో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. భద్రాద్రి, మహబూబాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ అదిలాబాద్, మంచిర్యాల, అసిఫాబాద్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబాబాద్, హైదరాబాద్, మేడ్చల్, నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు పడే చాన్స్ ఉండటంతో ఆ జిల్లాల్లో వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
జూన్ 26 వరకు హైదరాబాద్ నగరంలో వర్షం లేదా ఈదురుగాలులతో కూడిన చినుకులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరిక జారీ చేయనప్పటికీ, సోమవారం నాడు నగరం మేఘావృతమై కనిపించింది.