Weather Report : సమ్మర్ పీక్స్ కు చేరుకుంటుందా? ఉడికపోవడం గ్యారంటీయా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం హీటెక్కింది

Update: 2026-02-15 03:53 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం హీటెక్కింది. ఎండలు ముదురుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరుకుంటున్నాయి. రానున్న రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో ఉడికిపోవడం గ్యారంటీ అని అంటున్నారు. భారత వాతావరణ శాఖ అంచనాల మేరకు ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న అంచనాలున్నాయి. గరిష్టంగానే .. అలాగే ఊహించని విధంగానే ఎండలు నమోదవుతాయని అంటున్నారు. రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లోనూ ఎండల తీవ్రత భారీ స్థాయిలో ఉంటుందన్న అంచనాలు ప్రజలను భయపెడుతున్నాయి.

ఉడికిపోతున్న ఏపీ...
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడే వేసవి కాలం మొదలయిందనే చెప్పాలి. ఈ నెల చివరి నుంచి విద్యాసంస్థలకు ఒంటిపూట పెట్టాల్సిన పరిస్థితులు నెలకొనే అవకాశముందని చెబుతున్నారు. గరిష్టంగా ఉష్ణోగ్రతలు ఇప్పటికే నమోదవుతుండటం, రోడ్లు కాలిపోతున్నాయి. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ ఎండల తీవ్రత ఉంటుంది. మరొకైపు అమరావతి వాతావరణ శాఖ మాత్రం నేడు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని చెబుతున్నారు. కానీ ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలలో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు గరిష్టంగా, రాయలసీమలో మాత్రం సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశముందని చెబుతున్నారు.
గరిష్టంగానే నమోదవుతూ...
ఇక తెలంగాణలోనూ వాతావరణం మారింది. ఎండలు ఎక్కువవుతున్నాయి. అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ మాత్రం ఈ నెలాఖరులో అకాలవర్షాలు కురిసే అవకాశముందని చెబుతున్నాయి. ఒకసారి వర్షం పడి వెళితే ఇక అప్పటి నుంచి సమ్మర్ మరింత పీక్స్ కు చేరుకుంటుంది. వానలు పడ్డాయన్న సంతోషం ఆవిరి అయి.. ఉక్కపోతతో ఊపిరి ఆగిపోతుందన్న భయం నెలకొని ఉంది. ఇప్పటికే తెలంగాణలో అనేక చోట్ల గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్టంగా 33 డిగ్రీలు నమోదువుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక శివరాత్రి తర్వాత ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముంది. ప్రజలు బయటకు పగటి వేళ వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.


Tags:    

Similar News