Rain Alert : ఐదు రోజులు వర్షాలే
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరకిలు జారీ చేసింది. రానున్న ఐదు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
Ap weather updates
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న ఐదు రోజులు తెలంగాణాలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆ తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
ఏపీలోనూ...
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే తమిళనాడు అంతటా వర్షాలు కురుస్తున్నాయి.