Telangana : పంచాయతీ పోరు ప్రారంభం
తెలంగాణ లో నేడు తొలి విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమయింది.
తెలంగాణ లో నేడు తొలి విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో 189 మండలాలు, 4,235 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 56,19,430 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు ఇంకా ఓటర్లు చేరుకోలేదు. మధ్యాహ్నం వరకూ సమయం ఉండటంతో పోలింగ్ బాగా జరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.
భారీ భద్రత మధ్య...
పోలింగ్ కు భారీ భద్రత కల్పించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు మొహరించారు. ఈరోజు 27, 41,0 70 పురుష ఓటర్లుండగా, 28,78.159 మంది మహిళా ఓటర్లు, 201 ఇతర ఓటర్లున్నారని అధికారులు తెలిపారు. తొలి విడత ఎన్నికలకు సంబంధించి 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్, అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు. ఈరోజు మధ్యాహ్నానికి కౌంటిగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రానికి ఫలితాలు ప్రకటించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికను కూడా నిర్వహించనున్నారు.