Breaking: విజయశాంతి కాంగ్రెస్ లోకి మళ్లీ ఎందుకు వెళుతుందో తెలుసా?

బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ లో చేరనున్నారనే

Update: 2023-11-11 11:34 GMT

బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ లో చేరనున్నారనే వార్త సంచలనంగా మారింది. విజయశాంతి కాంగ్రెస్ లోకి వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి ప్రకటించడంతో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. విజయశాంతి త్వరలోనే కాంగ్రెస్ లో చేరతారని మల్లు రవి ప్రకటించారు. గత కొంత కాలంగా విజయశాంతి బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.. ప్రధాని మోదీ, అమిత్ షా కార్యక్రమాలకు కూడా ఆమె హాజరవ్వలేదు. బీజేపీ అధిష్టానంపై ఆమె అసంతృప్తితో ఉండడంతో.. ఆమె పార్టీ మారతారని చాలా రోజులుగా ప్రచారం సాగింది. ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఎంపీగా నిలబడతారేమోనని భావించారు. కానీ మల్లు రవి విజయశాంతి కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని ప్రకటించేశారు. అయితే విజయశాంతి నుండి ఎలాంటి ప్రకటన రాలేదు.

గత కొంత కాలంగా బీజేపీలో జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తితో ఉన్న విజయశాంతి బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఢిల్లీ కాంగ్రెస్ నేతలతో చర్చలు పూర్తి చేసిన విజయశాంతి అతి త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన విజయశాంతిని ఇటీవల బీజేపీ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ లిస్ట్‌లో చేర్చకపోవడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పుడే ఆమె పార్టీ మారే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి.


Tags:    

Similar News