నేను గేమింగ్ యాప్‌ను మాత్రమే ప్రమోట్ చేశా
బెట్టింగ్ యాప్ కేసులో నా పేరు రావడం తో విచారణకు పిలిచారని హీరో విజయ్ దేవరకొండ తెలిపారు.
బెట్టింగ్ యాప్ కేసులో నా పేరు రావడం తో విచారణకు పిలిచారని హీరో విజయ్ దేవరకొండ తెలిపారు. ఈడీ కార్యాలయంలో విచారణ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో బెట్టింగ్ యాప్స్ , గేమింగ్ యాప్స్ అని రెండు రకాలు ఉన్నాయి.. నేను A23 అనే యాప్ గేమింగ్ యాప్ అని ఈడీకి క్లారిటీ ఇచ్చానని పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్ , గేమింగ్ యాప్స్ కి సంబంధం లేదు.. గేమింగ్ యాప్స్ అనేది దేశంలో చాలా రాష్ట్రాల్లో లీగల్ అని.. గేమింగ్ యాప్స్ కి GST , టాక్స్, అనుమతులు, రిజిస్ట్రేషన్ ఉంటాయని.. దేశంలో గేమింగ్ యాప్స్ IPL , కబాడీ, వాలీ బాల్ కి స్పాన్సర్ చేస్తున్నారని పేర్కొన్నారు.
నా బ్యాంక్ లావాదేవీలు అన్ని కూడా ఈడీకి సమర్పించానని తెలిపారు. నేను ప్రమోట్ చేసిన A23 యాప్ అనేది తెలంగాణలో ఓపెన్ అవ్వదని.. నేను లీగల్ గా ఉన్న గేమింగ్ యాప్స్ ను మాత్రమే ప్రమోట్ చేశానని క్లారిటీ ఇచ్చారు. నేను చేసుకున్న కాంట్రాక్ట్, లీగల్‌గా తీసుకున్న అమౌంట్ వాటి వివరాలు అన్ని ఈడీకి ఇచ్చానని వివరించారు.