Telangaa : జోగినపల్లి సంతోష్ రావుపై పోలీసులకు ఫిర్యాదు
బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ రావుపై నేరెళ్లకు చెందిన యువకులు తంగెళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ రావుపై నేరెళ్లకు చెందిన యువకులు తంగెళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సంతోష్ రావు ప్రోద్బలతంతోనే తమపై అక్రమంగా కేసులు పెట్టి థర్డ్ డిగ్రీని ఉపయోగించారని నేరెళ్ల బాధితులు తెలిపారు. అప్పటి ఎస్సీ, ఏఎస్పీలు జోగినపల్లి సంతోష్ రావు ఆదేశాలతోనే తమపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు.
కల్వకుంట్ల కవిత ఆరోపణల నేపథ్యంలో...
నిన్న కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో నేరెళ్లకు చెందిన దళిత యువకులపై జోగినపల్లి సంతోష్ రావు ఆదేశాలతోనే అప్పటి పోలీసు అధికారుల కేసులు పెట్టి వేధించారని ఆరోపించిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం అతనిపై కేసు నమోదు చేయాలని నేరెళ్ల బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాధితుల నుంచి ఫిర్యాదును స్వీకరించారు.