అమ్మవారికి అగ్గిపెట్టెలో ఇమిడే చీర

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరిదేవి అమ్మవారికి ఓ చేనేత కార్మికుడు అగ్గిపెట్టెలో ఇమిడే చీరను అందించారు

Update: 2025-08-20 12:03 GMT

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరిదేవి అమ్మవారికి ఓ చేనేత కార్మికుడు అగ్గిపెట్టెలో ఇమిడే చీరను అందించారు. సిరిసిల్ల సాయినగర్‌కు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్‌ అగ్గిపెట్టెలో ఇమిడే చీరను అమ్మవారికి బహూకరించారు. ఈ చీర 5.5 మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు ఉన్నా ఇట్టే ఇమిడిపోతుంది. ఇక బరువు విషయానికి వస్తే 250 గ్రాముల బరువు ఉంటుంది. దీనిని పట్టుదారం, బంగారుజరీ, 21 రకాల సుగంధ ద్రవ్యాలతో తయారు చేసినట్లు విజయ్‌ వెల్లడించారు. ఆలయ ఇన్‌ఛార్జి ఈవో రాధాబాయికి ఈ చీరను అందజేశారు.

Tags:    

Similar News