Telangana : బీఆర్ఎస్ కు ఉత్తమ్ సవాల్

బీఆర్ఎస్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు

Update: 2025-11-27 08:08 GMT

బీఆర్ఎస్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఓఆర్ఆర్ విషయంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారని, ఐదు రూపాయలు అవినీతి కూడా జరగలేదని ఆయన అన్నారు. తెలంగాణ సమాజం మంచి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. విద్యుత్తు కొనుగోళ్లలో కూడా పైసా కూడా అవినీతి జరగలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పరిశ్రమలు ఔటర్ రింగురోడ్డుకు బయట ఉంటే కాలుష్యం తగ్గుదని భావించి ప్రభుత్వం ఈ నిర్నయం తీసుకుందని తెలిపారు. హైదరాబాద్ ను కాలుష్యం నుంచి కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

అధికారంలోకి వస్తే...
తాము అధికారంలోకి వస్తే మళ్లీపాలసీని మారుస్తామని కొందరు చెబుతున్నారని, వారు అధికారంలోకి వచేది లేదు. మార్చేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తుందన్నారు. కానీ ప్రజలు అన్నీ ఆలోచిస్తున్ానరని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అనవసర ఆరోపణలను మానుకుని ప్రభుత్వానికి అభివృద్ధి విషయంలో సహకరించాలని కోరారు. పైసా అవినీతి జరిగిందని నిరూపించినా తాను ఏం చేయడానికైనా సిద్ధమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.


Tags:    

Similar News