Kishan Reddy : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మీ సపోర్టు మాకు అనవసరం : కిషన్ రెడ్డి
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతును తాము కోరలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతును తాము కోరలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తమకు ఆ పార్టీ మద్దతు అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో తెలుగు వాడైన వెంకయ్య నాయుడు పోటీ చేసినప్పుడు కూడా తమకు మద్దతు ఇవ్వలేదని కిషన్ రెడ్డి తెలిపారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఎవరూ అడగలేదేని, ఆ అవసరం కూడా తమకు లేదని తెలిపారు.
యూరియా బస్తాపై...
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన బలం ఎన్డీఏకు ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ లోనే యూరియా కొరత ఉందని ఆయన తెలిపారు. యూరియా బస్తాపై కేంద్ర ప్రభుత్వం పెద్దయెత్తున సబ్సిడీ ఇస్తుందని ఆయన తెలిపారు. యూరియా ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని, తాము ఖచ్చితంగా రైతులందరికీ సరఫరా చేస్తామని తెలిపారు.