ఢిల్లీ తర్వాత తెలంగాణయే టార్గెట్

ఢిల్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత తమ గెలుపు తెలంగాణయే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు

Update: 2025-02-08 06:34 GMT

ఢిల్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత తమ గెలుపు తెలంగాణయే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ ను కోరుకుంటున్నారని వస్తున్న ఫలితాలను బట్టి అర్ధమవుతుందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ జీరో స్థానాలకే పరిమిమతమవుతుందన్న కిషన్ రెడ్డి కాంగ్రెస్ కు ఇక ఏ ఎన్నికల్లోనూ విజయం దక్కదని అన్నారు.

మోదీ పాలన పట్ల...
ప్రజలు మోదీ పాలన పట్ల మొగ్గు చూపుతున్నారని, అభివృద్ధి, సంక్షేమం సమ పాళ్లలో తీసుకెళ్లడంలో మోదీ ప్రభుత్వం విజయవంతం అయిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వంగా మోదీ సర్కార్ అందరిలోనూ గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఢిల్లీ తర్వాత తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు.


Tags:    

Similar News