Kishan Reddy : మూసీ పునరుద్ధరణకు మేం వ్యతిరేకం కాదు
మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు
kishan reddy clarified on musi
మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవం పేరుతో డ్రైనేజీ నీటిని మూసీ నదిలో కలవకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మూసీ నది రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పునరుజ్జీవమా? సుందరీకరణా? అన్నది తమకు అనవసరమని ఆయన అన్నారు.
పేదల ఇళ్లను...
అయితే పేదల ఇళ్లు కూల్చకుండా సుందరీకరణ చేయవవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మూసీ నది సుందరీకరణను వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం చేయడం సరికాదని ఆయన అన్నారు. తాము పునరుజ్జీవనానికి వ్యతిరేకం కాదని, అలాగే పేదల ఇళ్లను అకారణంగా కూల్చివేస్తే ఊరుకోబోమని కిషన్ రెడ్డి తెలిపారు. సుందరీకరణ కూడా చేయవచ్చని తెలిపారు.