nithik Gadkari : నేడు హైదరాబాద్ కు నితిన్ గడ్కరీ
కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేడు తెలంగాణకు రానున్నారు.
కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేడు తెలంగాణకు రానున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కాగజ్ నగర్, హైదరాబాద్ నగరంలో పలు జాతీయ రహదారులను ఆయన ప్రారంభించనున్నారు. శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 9 గంటలకు నాగపూర్ ఎయిర్ పోర్టు నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ కు చేరుకుంటారు. అక్కడ జాతీయ రహదారులను ప్రారంభిస్తారు.
సాయంత్రం హైదరాబాద్ కు...
మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3.30 గంటల వరకూ కన్హా శాంతి వనం సందర్శంచి అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు బీహెచ్ఈఎల్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించానున్నారు. సాయంత్రం ఆరు గంటలకు అంబర్ పేట్ ఫ్లైఓవర్ ను వర్చువల్ గా ప్రారంభిస్తారు. అక్కడి జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. రాత్రి ఏడు గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.