Telangana : వేలాది కోళ్లు మృతి... రైతుల్లో ఆందోళన

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వేలాది కోళ్లు మృత్యువాత‌ పడ్డాయి

Update: 2026-03-10 07:29 GMT

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వేలాది కోళ్లు మృత్యువాత‌ పడ్డాయి. ఒకేరోజు పది వేల కోళ్ల మృతి చెందడంతో కోళ్ల పెంపకందారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పౌల్ట్రీ రైతులను అంతుచిక్కని వైరస్ వణికిస్తుంది. నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి, నాగర్‌కర్నూల్‌ మండలాల్లో కోళ్లు మరణించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

విచారణ కోసం ఫోరెన్సిక్ నిపుణులు...
విచారణ కోసం ఫోరెన్సిక్ నిపుణుల బృందం రంగంలోకి దిగనున్నారు. బ‌ర్త్ ఫ్లూగా అనుమానం రైతులు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఏమీ వెలువడ లేదు. కోళ్ల మరణానికి గల కారణాలను బయటకు వస్తే తప్ప దాని నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. దీంతో కోళ్ల అమ్మకాలు పడిపోయాయి.


Tags:    

Similar News