Bandi Sanjay : తెలంగాణకు ఆర్మీ హెలికాప్టర్ల రాక ఆలస్యం
తెలంగాణకు ఆర్మీ హెలికాప్టర్ల రాక ఆలస్యం అవుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు
తెలంగాణకు ఆర్మీ హెలికాప్టర్ల రాక ఆలస్యం అవుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ మేరకు తనాు రక్షణశాఖ అధికారులతో మాట్లాడినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలో వరదల్లో సాయం అందించడానికి మూడు హెలికాప్టర్లు రెడీ చేశామన్న అధికారులు వాతావరణం అనుకూలించక చాపర్ల రాక ఆలస్యమని వివరించారు.
ప్రత్యామ్నాయ స్టేషన్ల నుంచి...
ప్రత్యామ్నాయ స్టేషన్ల నుంచి చాపర్లను రప్పిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. నాందేడ్, బీదర్ స్టేషన్ల నుంచి చాపర్లను పంపే ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు రాష్ట్రానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని, వరద బాధితులకు అండగా ఉంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు.