Bandi Sanjay : సీఎం రమేష్ కామెంట్స్ లో నిజముంది : బండి సంజయ్
పార్టీని నడుపుకోలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.
పార్టీని నడుపుకోలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కేటీఆర్ కు సిరిసిల్ల టిక్కెట్ ఇవ్వలేదని, అయితే కేటీఆర్ వెళ్లి సీఎం రమేష్ ను కలిశారన్నారు. సీఎం రమేష్ చెప్పబట్టే సిరిసిల్ల టిక్కెట్ కేసీఆర్ ఇచ్చాడన్న బండి సంజయ్ సిరిసిల్ల లో నాడు గెలిచేందుకు కేటీఆర్ కు సీఎం రమేష్ ఆర్థిక సాయం చేసిన మాట కూడా వాస్తవమేనని అన్నారు.
చర్చకు ఎక్కడైనా...
సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలో నిజముందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేయడానికి సీఎం రమేష్ వద్దకు కేటీఆర్ వచ్చింది వాస్తవమేనని అన్నారు. సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తో ఎక్కడ చర్చించడానికైనా సిద్ధమని బండి సంజయ్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ మనుగడ రాజకీయంగా కష్టమేనని తేల్చారు.