Bandi Sanjay : ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేంద్ర మంతి సంచలన కామెంట్స్
ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్ కు నోటీసులు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై అందరికంటే ముందు తానే ఆరోపణలు చేశానని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్, సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బండి జంజయ్ తెలిపారు.
అమెరికాకు వెళ్లిన కేటీఆర్...
పెద్దాయన చెబితేనే ఫోన్లు ట్యాప్ చేసినట్లు అధికారులు స్టేట్‌మెంట్ ఇచ్చారని, ప్రభాకర్ రావు చాలా మంది సంసారాలు నాశనం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ అనేక మంది ఉసురు పోసుకున్నారన్న బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమెరికాకు వెళ్లిన కేటీఆర్ అక్కడ ప్రభాకర్ రావును కలిసి అన్ని మాట్లాడుకున్న తర్వాతే ఇండియాకు వచ్చారని, ఈ కేసులో కేటీఆర్, కేసీఆర్ లను కూడా విచారించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.