Bandi Sanjay : బీఆర్ఎస్ బీజేపీలో విలీనంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్

బీఆర్ఎస్ బీజేపీలో విలీనంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు.

Update: 2025-05-31 06:43 GMT

బీఆర్ఎస్ బీజేపీలో విలీనంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న డ్రామాకు కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్, స్క్రీన్ ప్లే అని ఆయన అన్నారు. కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేయకుండా ఉండేందుకు బీజేపీలో కలవాలని బీఆర్ఎస్ ప్రయత్నించిందని బండి సంజయ్ అన్నారు.

అవినీతి పార్టీని...
కానీ అవినీతి పార్టీ, కుటుంబ పార్టీని కలుపుకునేందుకు బీజేపీ పార్టీ సిద్ధంగా లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ఇక కోలుకోలేదని, ప్రజల్లో పూర్తిగా విశ్వాసం పోయిందని, అటువంటి పార్టీని తమ పార్టీలో ఎందుకు కలుపుకుంటామని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈసారి అధికారంలోకి వచ్చేది బీజేపీయేనంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.


Tags:    

Similar News