Bandi Sanjay : కేటీఆర్ పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు

కేంద్రమంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు

Update: 2025-09-22 04:33 GMT

కేంద్రమంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై బీఆర్ఎస్ నడుస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్ ఎందుకు తిరుతున్నారో చెప్పాలన్నారు. ఆ లగ్జరీ కార్లు కేటీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ చేశారని బండి సంజయ్ ప్రశ్నించారు.

మనీ ల్యాండరింగ్ జరిగిందా?
మార్కెట్ ధర చెల్లించారా? లేదా? తక్కువగా చూపించి కొనుగోలు చేశారా? లేక పేమెంట్లు బినామీ పేర్లతో జరిగాయా? అన్నది దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మనీలాండరింగ్ జరిగిందా? లేక నకిలీ ఆదాయమా? అన్నది తేల్చాలన్నారు. ఈ లగ్జరీ కార్ల స్కామ్ లో కేసీఆర్ కుటుంబం నేరుగా లబ్ది పొందినట్లు అనుమానం ఉందని అన్నారు.


Tags:    

Similar News