మొయినా బాద్ డ్రగ్స్ పార్టీపై కీలక అంశాలివే

మొయినా బాద్ ఫాంహౌస్ డ్రగ్స్‌ పార్టీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు

Update: 2026-03-16 07:59 GMT

మొయినా బాద్ ఫాంహౌస్ డ్రగ్స్‌ పార్టీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో పలు కీలక అంశాలను పోలీసులు ప్రస్తావించారు. డ్రగ్స్‌తో పాటు మందు పార్టీ కూడా మొయినాబాద్ లో జరిగిందని తెలిపారు. మద్యం, కొకైన్ కలుపుకొని తాగారని ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్నారు.

ఆరుగురికి పాజిటివ్...
ఈ డ్రగ్స్ కేసులో పదకొండు మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. తాము పోలీసులమని చెప్పినా కాల్పులు జరిపారని అన్నారు. రితేష్‌రెడ్డి రివాల్వర్‌ స్వాధీనం చేసుకున్నామన్న పోలీసులు నమిత్‌ శర్మ కాల్పులు జరిపినట్టు గుర్తించామని చెప్పారు. సిమ్లాలో కొకైన్ కొన్నట్టు కౌశిక్ అంగీకరించాడని, రోహిత్‌రెడ్డి ఆహ్వానం మేరకే పార్టీకి వచ్చారని ఎఫ్ఐఆర్ తెలిపారు.


Tags:    

Similar News