రేవంత్ కు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. 1994 లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే మోదీ కులం బీసీ జాబితాలో ఉందని గుర్తు చేశారు. రాసట్్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ దారి మళ్లించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు.
రాహుల్ కులంపైనా...
రాహుల్ ది ఏ కులం? ఏ మతం? అని బండి సంజయ్ చర్చించారు. కులం చర్చించదలచుకుంటే, లేకుంటు మతం మార్చుకునే విషయంపైనా ముందుగా జన్పథ్ నుంచి చర్చమొదలుపెట్టాలని బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోదీని విమర్శించే స్థాయి రేవంత్ కు లేదన్న బండి సంజయ్ తాము అధికారంలోకి వస్తే మైనారిటీలకు రిజర్వేషన్లు తొలగిస్తామని ఎన్నికలకు ముందే చెప్పామని గుర్తు చేశారు.