గద్దర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
గద్దర్ కు పద్మ పురస్కారం ఎలా ఇస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు
గద్దర్ కు పద్మ పురస్కారం ఎలా ఇస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. మావోయిస్టులతో కలసి బీజేపీ నేతలను చంపడంలో గద్దర్ సహకరించారని ఆరోపించారు. ఎవరికి అవార్డులు ఇవ్వాలో? ఇవ్వకూడదో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. గద్దర్ నక్సల్ భావాజాలం ఉన్న వ్యక్తి అని ఆయన అన్నారు.
పార్టీకార్యకర్తలను...
ఒకరు చెప్పినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వదని, దానికి కొన్ని నిబంధనలు చూస్తుందని తెలిపారు. గద్దర్ భావాజాలం ఏంటని బండి సంజయ్ ప్రశ్నించారు. తమ పార్టీ కార్యకర్తలను చంపడమే కాకుండా, తమ పార్టీకి వ్యతిరేకంగా పాటలను పాడిన వ్యక్తి గద్దర్ అంటూ ఆయన అన్నారు. ఎలాంటి వ్యక్తులకు ఇవ్వాలో తమకు తెలుసునని ఆయన అన్నారు.