Telangana : 24 గంటల్లో ఏపీలో రిపోర్ట్ చేయండి.. ఐపీఎస్ లకు కేంద్రం ఆదేశం

తెలంగాణాలో ఉన్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది.

Update: 2025-02-22 02:24 GMT

తెలంగాణాలో ఉన్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. వారు వెంటనే ఆంధ్రప్రదేశ్ లో రిపోర్టు చేయాలనికోరింది. ముగ్గురు ఐపీఎస్ అధికారులు అభిలాష్ బిస్తా, అభిషేక్ మహంతి, అంజనీకుమార్ లను వెంటనే రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

రాష్ట్ర విభజన సందర్భంగా...
ఇరవై నాలుగు గంటల్లోగా వారు ఆంధ్రప్రదేశ్ లో రిపోర్టు చేయాలని కూడా పేర్కొంది. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి కేటాయించిన అధికారులు కొన్నాళ్ల నుంచితెలంగాణాలోనే పనిచేస్తున్నారు. డీజీ ర్యాంక్ లో అంజనీకుమార్, రోడ్ సేఫ్టే డీజీగా ఉన్ారు. పోలీస్ ట్రైనింగ్ డీజీగా అభిలాష్ బిస్తా, ఎస్సీ ర్యాంక్ లో అభిషేక్ మహంతి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్నారు.


Tags:    

Similar News