Amit Shah : అమిత్ షా పర్యటన వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఒకరోజు వాయిదా పడింది
Amit shah
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఒకరోజు వాయిదా పడింది. నిజానికి ఈరోజు రాత్రికి హైదరాబాద్ కు అమిత్ షా చేరుకోవాల్సి ఉంది. రేపు ఉదయం 10.30 గంటలకు సోమాజీగూడలోని హోటల్ క్షత్రయలో ఆయన బీజేపీ మ్యానిఫేస్టోను విడుదల చేయాల్సి ఉంది. అయితే ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రేపటి కార్యక్రమాలు మాత్రం...
అమిత్ షా నేటి రాత్రికి హైదరాబాద్‌కు రావడం లేదు. రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ేచేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయం కి రానున్న అమిత్ షా అక్కి నుంచి నేరుగా రేపు గద్వాల, నల్లగొండ, వరంగల్ సభల్లో పాల్గొననున్నారు. రేపు సాయత్రం 6.10 గంటలకు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.