Amith Sha : ఈ నెల 28న అమిత్ షా హైదరాబాద్ రాక
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 28 హైదరాబాద్ రానున్నారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాల్లో పాల్గొంటారు
amit shah
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 28న హైదరాబాద్ రానున్నారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఎన్నికల కార్యాచరణను ఆయన సిద్ధం చేయనున్నారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలకు లోక్‌సభ ఎన్నికల విషయంలో దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేయనున్నారు.
శాసనసభ పక్ష నేతను...
పది పార్లమెంటు నియోజకవర్గాలపై బీజేపీ దృష్టి పెట్టింది. అక్కడే ఫోకస్ చేయాలని నిర్ణయించింది. అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలను అమిత్ షా నేతలకు వివరించనున్నారు. అమిత్ షా తర్వాత పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అమిత్ షా సమక్షంలోనే బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేతను ఎన్నుకోనున్నారు.