తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఉన్న విద్యామండలి చైర్మన్ లింబాద్రి ఈ షెడ్యూల్ ను..

Update: 2022-03-29 11:18 GMT

హైదరాబాద్ : తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఉన్న విద్యామండలి చైర్మన్ లింబాద్రి ఈ షెడ్యూల్ ను విడుదల చేశారు. మూడేళ్ల ఎల్ఎల్ బీ కోర్సు కోసం రాసే టీఎస్ లాసెట్ పరీక్షను జులై 21న నిర్వహించనున్నట్లు లింబాద్రి వెల్లడించారు. అలాగే ఐదేళ్ల ఎల్ఎల్ బీ కోర్సు లా సెట్ పరీక్షను, పీజీఎల్ సెట్ ను కూడా జులై 22నే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జులై 27,28 తేదీల్లో ఐసెట్, జులై 29 నుంచి ఆగస్టు 1 వరకూ పీజీఈసెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.




Tags:    

Similar News