దానం నాగేందర్ కు హైకోర్టుకు నోటీసులు

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది

Update: 2026-03-23 06:53 GMT

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. దానం నాగేందర్ పార్టీ మార్పుపై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం దానం నాగేందర్ కు నోటీసులు జారీచేసింది.

బీజేపీ ఎమ్మెల్యే కేసుపై...
దానం నాగేందర్ పార్టీ మారలేదని, బీఆర్ఎస్ లోనే ఉన్నారంటూ స్పీకర్ గడ్డం ప్రసాదరావు తీర్పు చెప్పిన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే తీర్పును సవాల్ చేశారు. ఈవిచారణపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలంటూ దానం నాగేందర్ కు నోటీసులు జారీ చేసిన హైకోర్టు విచారణను వాయిదావేసింది.


Tags:    

Similar News