Telangana : గ్యాస్ కొరత పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
ఎల్.పి.జి గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు
ఎల్.పి.జి గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎల్.పి.జి లేక జనం అవస్థలు పడుతున్నారన్నారు. కేవలం ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు మాత్రమే గ్యాస్ సరఫరాను కేంద్ర ప్రభుత్వం చేస్తుందని, కేంద్రాన్ని డిమాండ్ చేయలేనిపరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు. గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చినప్పటికీ దానిని స్పీకర్ తిరస్కరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు...
రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ కొరతపై తామేమే చేయలేమని చేతులెస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ అన్నారు. మరొకవైపు కేంద్ర ప్రభుత్వం భవిష్యత్ లో సిలిండర్ సైజ్ కూడా తగ్గిస్తారన్న ప్రచారం జరుగుతుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడిని ఇబ్బంది పెట్టేవిధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. కొరత లేకపోయినా బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్నా ప్రభుత్వాలు అడ్డుకోలేకపోతున్నాయని కేటీఆర్ అన్నారు.