Hyderabad : మొయినా బాద్ డ్రగ్స్ కేసులో నేటి నుంచి విచారణ
మొయినా బాద్ డ్రగ్స్ కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు
మొయినా బాద్ డ్రగ్స్ కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలనుచంచలగూడ జైలు నుంచి ఉదయం అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం సూచనల మేరకు మూడు రోజులు పాటు ఈ ముగ్గురిని విచారించనున్నారు.
ముగ్గురిని అదుపులోకి తీసుకుని...
రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను మొయినాబాద్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు కోసం ప్రభుత్వం నియమించిన సిట్ నిందితులను కస్టడీకి అనుమతించాలని కోరింది. దీంతో మూడు రోజుల పాటు విచారణ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ విచారణలో డ్రగ్స్ సరఫరా, నెట్ వర్క్ కు సంబంధించిన విషయాలపై ఆరా తీయనున్నారు. న్యాయవాదుల పర్యవేక్షణలోనే విచారణ కొనసాగాలని న్యాయస్థానం చెప్పింది.