అపరిచితుడు రేవంత్ రెడ్డి.! కాదు కాదు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ ట్రోలింగ్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్‌గా నెట్టింట ట్రోలింగ్ చేస్తోంది టీఆర్ఎస్. ఆయన అపరిచితుడంటూ వీడియో ట్వీట్ చేశారు.

Update: 2022-05-04 14:27 GMT

others

రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు వెరీకామన్. నేతలు చాలెంజ్‌లు విసురుకోవడం.. ప్రత్యర్థులు దమ్ముంటే రమ్మనమనడం కూడా కామనే. కాకపోతే రేవంత్ రెడ్డి లాంటి ఫైర్‌బ్రాండ్స్ సవాల్ చేస్తే మాత్రం హీట్ రాజుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ని టార్గెట్ చేసే తీరు ఆ రేంజ్‌లో ఉంటుంది మరి.. అయితే తాజాగా రేవంత్ సవాళ్ల వీడియో ఒకటి టీఆర్ఎస్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోంది.

సవాల్ చేసినా.. ఒకవేళ తమ నేత కేటీఆర్ సవాల్ స్వీకరించినా రేవంత్ రెడ్డి మాత్రం అన్నీ మర్చిపోతున్నారనేది టీఆర్ఎస్ నేతల కామెంట్. ఆయన అపరిచితుడయ్యాడని ఏం గుర్తుండడం లేదంటూ ఎద్దేవా చేస్తున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేటీఆర్‌ని సవాల్‌ని స్వీకరించిన రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రతి సవాల్ విసిరారు. ఆయన ఆ ఎన్నికల్లో అక్కడ ఓడిపోయారు. ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు.

ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డి అదే సవాల్ చేశారు. ఇక టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని బలిదేవత అని వ్యాఖ్యానించారు. తెలంగాణ మట్టి మనదిరా.. తెలుగు దేశం పార్టీ మనదిరా అంటూ ప్రవచించిన రేవంత్ రెడ్డి అపరిచితుడిలా మారారంటూ తీవ్ర స్థాయిలో నెట్టింట రచ్చ చేస్తున్నారు. ఆ ట్వీట్‌ను మంత్రి కేటీఆర్ కూడా లైక్ చేయడం మరింత ఆసక్తిని రేపుతోంది.

అయితే నెటిజన్లు మాత్రం టీఆర్ఎస్ నేత ట్వీట్‌పై భిన్నంగా స్పందిస్తున్నారు. రేవంత్‌ది ఓవర్ కాన్ఫిడెన్స్ అని కొందరంటే.. మరికొందరు నెగెటివ్ కామెంట్స్‌తో విరుచుకుపడుతున్నారు. పొలిటికల్ పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అలా సవాల్ చేసే టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా గడ్డం పెంచుతున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. అందుకు మరో నెటిజన్ ఘాటుగానే రిప్లై ఇచ్చారు. కేసీఆర్ ఫ్యామిలీ కూడా సోనియా గాంధీకి వంగివంగి దండాలు పెట్టిన విషయం మర్చిపోవద్దని గుర్తుచేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కౌంటరిస్తుందో చూడాలి మరి!!



Similar News