ఎమ్మెల్యే మహీపాల్ కి సుప్రీంకోర్టు నోటీసులు

ఈ వ్యవహారంపై హైకోర్టు న్యాయవాది ఎంఏ ముఖీం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన మాట్లాడుతూ

Update: 2023-06-07 08:13 GMT

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్న ఆయనకు ఒక్కసారిగా సుప్రీంకోర్టు నుండి నోటీసులు రావడంతో డీలా పడిపోయారు. నెక్ట్స్ ఏమి జరుగుతుందా అని ఆయన వర్గంలో టెన్షన్ నెలకొంది. గతంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమ యజమానిపై దాడి చేసిన కేసులో సంగారెడ్డి అడిషనల్‌ కోర్టు 2015లో రెండున్నరేళ్ల జైలుశిక్షను విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఎమ్మెల్యే జిల్లా కోర్టుకు వెళ్లగా అడిషనల్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై జిల్లా కోర్టు స్టే విధించింది. జిల్లా కోర్టు స్టే నిర్ణయంపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, బాధితుడైన పరిశ్రమ యజమాని పొట్టి చందుకుమార్‌తో రాజీ కుదుర్చుకున్నారు. దీంతో 2022 మార్చిలో మహిపాల్‌రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. దీంతో పాటు కింది కోర్టులో ఉన్న కేసులను సైతం స్క్వాష్‌ చేస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది.

ఈ వ్యవహారంపై హైకోర్టు న్యాయవాది ఎంఏ ముఖీం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా కోర్టులో కేసు విచారణలో ఉండగానే హైకోర్టులో బాధితులతో రాజీపడడం ఏమిటని ప్రశ్నించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అనిరుద్దాబోస్‌, రాజే్‌షబిందాల్‌తో కూడిన ధర్మాసనం సోమవారం నోటీసు జారీ చేసింది.


Tags:    

Similar News