కేసీఆర్ కుటుంబంలో విషాదం.. సోదరి మృతి

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇంట్లో విషాదం నెలకొంది. కేసీఆర్ సోదరి చీటీ సకలమ్మ మరణించారు.

Update: 2025-01-25 02:45 GMT

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇంట్లో విషాదం నెలకొంది. కేసీఆర్ సోదరి చీటీ సకలమ్మ మరణించారు. సకలమ్మ కేసీఆర్ ఐదో సోదరి. ప్రతి ఏడాది రాఖీ పండగ నాడు కేసీఆర్ వద్దకు వచ్చి సోదరుడికి రాఖీ కట్టేవారు. కేసీఆర్ సోదరి సకలమ్మగత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.

అనారోగ్యంతో బాధపడుతూ...
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఆమె కన్ను మూశారు. వృద్ధాప్యం కారణంగా ఎదురయిన అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. తన సోదరి కుటుంబాన్ని పరామర్శించేందుకు నేడు ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి కేసీఆర్ రానున్నారు. పార్టీ శ్రేణులు సకలమ్మ మృతి పట్ల సంతాపాన్ని తెలిపారు.


Tags:    

Similar News