Telangana : నేడు కీలక మావోయిస్టు లీడర్లు లొంగుబాటు

ఈరోజు తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోతారని సమాచారం

Update: 2025-11-22 04:15 GMT

ఈరోజు తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోతారని సమాచారం. మావోయిస్టుల కార్యకలాపాలను అణచేందుకు భద్రతా దళాలు చేపట్టిన దాడులు వేగం పెంచిన నేపథ్యంలో, పెద్ద ఎత్తున మావోయిస్టు నాయకులు, దళ సభ్యులు లొంగేందుకు సిద్ధమవుతున్నారు. శనివారం దాదాపు 30 మంది ఆయుధాలు వదిలి టీఎస్ పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు ముందుకు వస్తున్నట్టు సమాచారం. వారిలో నిషేధిత సీపీఐ మావోయిస్టు టీజీ రాష్ట్ర కమిటీకి చెందిన నాయకులు కొయ్యాడ సమ్బయ్య అలియాస్‌ ఆజాద్‌, అప్పాసి నరాయణ అలియాస్‌ రమేశ్‌ ఉన్నట్టు అధికారులు తెలిపారు. దాదాపు ముప్ఫయి ఏడు  మంది మావోయిస్టులు నేడు లొంగిపోతారని తెలిసింది. 

అధికారికంగా...
డీజీపీ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. అక్కడే అధికారికంగా లొంగుబాటు విషయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన రెండు ఎన్‌కౌంటర్ల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆ ఎన్‌కౌంటర్లలో సుమారు 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. వారిలో అగ్ర కమాండర్‌ హిడ్మా కూడా ఉన్నాడు. దాదాపు 300 మంది భద్రతా సిబ్బంది హత్యల్లో అతడు ప్రమేయం ఉన్నట్టు విచారణల్లో వెలుగులోకి వచ్చింది. హిడ్మా భార్య కూడా ఆ ఆపరేషన్‌లో మృతిచెందింది. ఇటీవలి ఆపరేషన్ల తర్వాత హింసను వదిలి ప్రధానస్రవంతిలో చేరాలనుకునే మావోయిస్టులకు పూర్తి సహాయం అందిస్తామని పోలీసులు మరోసారి పిలుపునిచ్చారు.


Tags:    

Similar News