నేడు బీసీ కులగణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
ఈరోజు బీసీ కులగణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ప్రభుత్వం నిర్వహించనుంది
ఈరోజు బీసీ కులగణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ప్రభుత్వం నిర్వహించనుంది. మధ్యాహ్నం పన్నెండు గంటలకు అసెంబ్లీ హాలులో ఈ ప్రెజెంటేషన్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బీసీ కులగణనకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అందరికీ అర్థమయ్యేలా వివరించనున్నారు.
అవగాహన పెంచేందుకు...
ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు స్పీకర్ తో పాటు మండలి ఛైర్మన్ కూడా హాజరు కానున్నారు. బీసీ కులగణనకు సంబంధించి అవగాహన పెంచుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని కోరారు. ఇందుకు సంబంధించి అసెంబ్లీ హాలులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బీసీ కులగణన వల్ల ప్రయోజనంపై వీరికి వివరించనున్నారు.