నేడు రెండోరోజు పోలీస్ కస్టడీకి నమ్రత
నేడు రెండోరోజు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేర్ సెంటర్ యజమాని నమ్రతను పోలీస్ కస్టడీకి తీసుకోనున్నారు
నేడు రెండోరోజు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేర్ సెంటర్ యజమాని నమ్రతను పోలీస్ కస్టడీకి తీసుకోనున్నారు. తొలిరోజు ప్రశ్నలకు సమాధానం డాక్టర్ నమ్రత చెప్పని కారణంగా రెండో రోజు ఆమెను ప్రశ్నిస్తారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేర్ సెంటర్ లో జరిగిన అక్రమాలపై నమ్రతను ప్రశ్నించనున్నారు. ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్ల పాత్రపై పోలీసుల ఆరా తీయనున్నారు.
అనేక విషయాలపై...
పిల్లలను కేవలం దత్తత ఇచ్చానని నమ్రత చెబుతుండటంతో దానిపై కూడా అధికారులు లోతుగా అధ్యయనం చేయనున్నారు. దీంతో పాటు నమ్రత మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లాం, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులుపై చేసినఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ఇప్పటి వరకూ ఎంతమంది పిల్లలను దత్తత ఇచ్చారన్న విషయంపై కూడా ఆరా తీయనున్నారు.