Telangana : నేడు తెలంగాణలో ఎమ్మార్పీఎస్ నిరసన
తెలంగాణలో నేడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నిరసనలకు దిగనుంది.
manda krishna madiga
తెలంగాణలో నేడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నిరసనలకు దిగనుంది. జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేసి తమ నిరసనలను తెలియ చేయనుంది. ఉపాధ్యాయ నియామకాల్లో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకుండా తెలంగాణ ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేసిందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు.
జిల్లా కేంద్రాల్లో నిరసనలు...
అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలియజేయాలని పిలుపు నిచ్చినట్లు తెలిపారు. ఇప్పుడు భర్తీ చేసిన టీచర్ ఉద్యోగాల్లో మాదిగలకు పన్నెండు వందల ఉద్యోగాలు రావాలని, కానీ రాలేదని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పుడు మాదిగలకు రిజర్వేషన్లు అమలు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఈ నియామకాల్లో రిజర్వేషన్ చేపట్టలేదని ఆయన తెలిపారు.