నేడు బీజేపీ మౌన దీక్షలు

రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నేడు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసన దీక్షలు చేపడుతుంది.

Update: 2022-02-03 01:42 GMT

రాజ్యాంగాన్ని మార్చాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నేడు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసన దీక్షలు చేపడుతుంది. మండల, జిల్లా పార్టీ కార్యాలయాల్లో నేతలు మౌన దీక్ష చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రెండు రోజుల క్రితం కేసీఆర్ రాజ్యాంగం మార్చాలంటూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ దీక్షలను చేపట్టనున్నారు.

కేసీఆర్ వ్యాఖ్యలకు....
ఢిల్లీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మౌన దీక్ష చేపట్టనున్నారు. తొలుత ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం దీక్ష చేపడతారు. ఈ దీక్షలో ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాాబూరావుతో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొననున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని బీజేపీ నేతలు ఈ దీక్షలు చేపడుతున్నారు.


Tags:    

Similar News