Telangana : ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

తెలంగాణ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి ముగ్గురు అక్కా చెల్లెల్లు మరణించారు.

Update: 2025-11-03 06:11 GMT

తెలంగాణ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి ముగ్గురు అక్కా చెల్లెల్లు మరణించారు. ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరు ముగ్గురూ హైదరాబాద్ లో చదువుకుంటున్నారు. ఈరోజు ఉదయం ఐదు గంటలకు తాండూరు బయలుదేరే ఆర్టీసీ బస్సులోకి ఎక్కి హైదరాబాద్ కు చేరుకోవాలనుకున్నారు. కానీ టిప్పర్ ఢీకొట్టడంతో ముగ్గురు అక్కా చెల్లెళ్లు మరణించారు.

కుమార్తెలను కోల్పోయిన తల్లి...
తాండూరుకు చెందిన తనూషా, సాయిప్రియ, నందిని ముగ్గురు ఈ రోడ్డు ప్రమాదంలో మరణించారు. తాండూరు వద్ద ఉన్న వడ్డెరపల్లికి చెందిన గ్రామానికి చెందిన వారైన వీరు హైదరాబాద్ లో చదువుకునేందుకు సోమవారం తెల్లవారు జామున బయలుదేరి వస్తుండగా ఈ ప్రమాదంలో చిక్కుకుని మరణించడం అక్కడ ఉన్న వారందరినీ కలచి వేస్తుంది. ఆ తల్లి ముగ్గురు కన్న కూతుళ్లను కోల్పోయి రోదిస్తున్న తీరు వర్ణనాతీతంగా ఉంది.


Tags:    

Similar News