Telangana: రాజ్ భవన్ కు కొత్త మంత్రుల పేర్లు
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి మూడు పేర్లు ఖరారయ్యాయి.
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి మూడు పేర్లు ఖరారయ్యాయి. గవర్నర్ కార్యాలయానికి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపారు. రాజ్ భవన్ కు రేవంత్ రెడ్డి పంపిన జాబితాలో ముగ్గురు పేర్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఈరోజు ముగ్గురు మాత్రమే కేబినెట్ లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఫోన్ చేసి చెప్పిన...
ప్రమాణ స్వీకారం చేయాల్సిన ముగ్గురికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. కుటుంబ సభ్యులతో సహా రాజ్ భవన్ కు హాజరు కావాలని కోరారు. ఈరోజు మధ్యాహ్నం రాజ్ భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దాదాపు రెండేళ్ల తర్వాత తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరుగుతంది.