పొలాల్లో వేలాది కోళ్లు పోలీసులు విచారిస్తే!!
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారిపై వేలాది నాటుకోళ్లు కనిపించాయి.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారిపై వేలాది నాటుకోళ్లు కనిపించాయి. ఎల్కతుర్తి మండల కేంద్రంలోని పొలాల్లో కోళ్లు తిరుగుతుండడంతో చాలామంది వాటిని పట్టుకుపోయారు. ఎక్కడి నుండి వచ్చాయో, ఎవరు వదిలి వెళ్లారో తెలియని పరిస్థితి. దీంతో వైద్య శాఖ అధికారులు ఆ కోళ్లను తినవద్దని ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల విచారణలో ఈ కోళ్లు అక్కడ కనిపించడానికి కోళ్ల ఫారమ్ యజమాని కారణమని తేలింది. బీమా సొమ్ము కోసమే కోళ్ల ఫారమ్ యజమాని నాటుకోళ్లను వదిలినట్లు పోలీసులు నిర్ధారించారు. గుర్తు తెలియని వ్యక్తులు కోళ్లను వదిలి వెళ్లారని కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి.. దీనికి యజమానే కారణమని తేల్చారు.