మోసాల చెంబు ఇది నమ్మితే ముంచేస్తుంది!!
ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తారా? కాసులకు కక్కుర్తి పడి నమ్మేశారంటే దారుణంగా మోసపోకతప్పదు.
ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తారా? కాసులకు కక్కుర్తి పడి నమ్మేశారంటే దారుణంగా మోసపోకతప్పదు. అత్యంత శక్తివంతమైన మహిమ గల చెంబు తమ వద్ద ఉందని చెబుతారు. అందులో డబ్బులు వేస్తే రెట్టింపు అవుతాయని చెప్తారు. డబ్బులు వేశారంటే ఇక అడ్డంగా మోసపోకతప్పదు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని సీహెచ్ కొండూర్ గ్రామంలో సాయికృష్ణ నివాసం ఉంటున్నాడు. ఇతనికి బావ వరస అయిన నర్సింగరావు హైదరాబాద్లో ఉంటున్నాడు. నర్సింగరావు, ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ఎతిరాజుల రాఘ వేంద్ర, శ్రీరామరాజు కలసి హైదరాబాద్లో ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముగ్గురూ ఇటీవల సాయికృ ష్ణను కలిశారు. మాటామాటా కలిపి తమ వద్ద మహిమ గల చెంబు ఉందంటూ మాయమాటలు చెప్పారు. చెంబు ఖరీదు సుమారు రూ. 30 కోట్ల వరకు ఉంటుందన్నారు. అందులో డబ్బులు వేస్తే డబుల్ అవుతాయని నమ్మించారు. అయితే ముందుగా దానిని శుభ్రం చేయించడానికి డబ్బులు అవసరం అవుతాయని చెప్పారు. ఇది నిజమని నమ్మిన సాయికృష్ణ విడతల వారీగా నిందితులకు 75 లక్షల దాకా ఇచ్చాడు. ఆరు నెలలు గడిచినా డబ్బులు రాలేదు, చెంబు చూపించలేదు. చివరికి మోస పోయానని గ్రహించిన సాయికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.