అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి.. కాల్పుల కారణంగానే

అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తెలంగాణకు చెందిన విద్యార్థి మరణించారు.

Update: 2024-11-30 06:09 GMT

అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తెలంగాణకు చెందిన విద్యార్థి మరణించారు. అమెరికాలో వరసగా కాల్పుల ఘటనలు కలకలంరేపుతున్నాయి. అందరి వద్ద గన్ లు ఉండటంతో ఎవరు ఎప్పుడు ఎటు వైపు నుంచి కాలుస్తారో తెలియని పరిస్థితి అమెరికాలో నెలకొంది. గత కొద్ది రోజులుగా తుపాకీ కాల్పులకు అనేక మంది బలయిపోయారు.

ఖమ్మం జిల్లాకు చెందిన...
తాజాగా అమెరికాలో జరిగిన కాల్పులకు మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. చికాగో వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లా రామన్నపేటకు చెందిన నూకరపు సాయితేజ మృతి చెందారు. సాయితేజ వయసు 26 ఏళ్లు. సాయితేజ ఎంఎస్ చదవడానికి నాలుగు నెలల క్రితమే అమెరికా వెళ్లాడు. అతడు షాపింగ్ మాల్లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తుండగా దొంగతనానికి వచ్చిన దుండగులు కాల్పులు జరిపినట్లు సమాచారం.


Tags:    

Similar News