రుద్రమదేవి దిగిన బావిని బతికించారు

రాణి రుద్రమదేవి స్నానం చేసిన కాకతీయుల కాలం నాటి మెట్లబావికి పూర్వ వైభవం వచ్చింది.

Update: 2025-10-28 15:25 GMT

రాణి రుద్రమదేవి స్నానం చేసిన కాకతీయుల కాలం నాటి మెట్లబావికి పూర్వ వైభవం వచ్చింది. వరంగల్ ఫోర్టురోడ్డు శివనగర్లో నలువైపులా 14 మీటర్ల వెడల్పుతో చతురస్రాకారంలో ఉంటుంది ఈ బావి. కాకతీయుల కాలం నాటి శిల్పసంపదకు సాక్ష్యం. సరైన నిర్వహణ లేక శిథిలావస్థకు చేరిన బావి పునరుద్ధరణ పనులు చేపట్టారు. అవి పూర్తవడంతో ఆ బావిని మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. కాకతీయ కోట నుంచి ఈ బావికి రుద్రమ దేవి సొరంగ మార్గాన వచ్చేవారని, ప్రస్తుతం ఆ మార్గం పూడుకుపోయిందని స్థానికులు చెబుతారు. ఈ బావి ఇక టూరిస్ట్ స్పాట్ గా మారిపోనుందని స్థానికులు చెబుతున్నారు.

Tags:    

Similar News