TGRTC : ఆర్టీసీలో ఏఐ టెక్నాలజీ.. ఇక బస్సుల కోసం వెయిట్ చేయక్కర్లేదట
తెలంగాణలో ఆర్టీసీ బస్సులు షెడ్యూల్ చేసేందుకు టీజీ ఆర్టీసీ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలీజీని వాడనుంది
తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై బస్సుల కోసం వెయిట్ చేయకుండా రద్దీ ఉన్న ప్రాంతాల్లో బస్సులు తిప్పేందుకు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తేనున్నారు. తెలంగాణలో ఆర్టీసీ బస్సులు షెడ్యూల్ చేసేందుకు టీజీ ఆర్టీసీ ఏఐ వాడనుంది. తెలంగాణ ఆర్టీసీలో పండుగలకు, సెలవులకు ఏ మార్గంలో ఎన్ని బస్సు నడపాలో ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ నిర్ణయించనుంది.
షెడ్యూల్ ను కూడా...
ఆర్టీసీ బస్సుల షెడ్యూల్‌ను అధికారులు నిర్ణయించడం వల్ల పలు మార్గాల్లో బస్సులు సరిపోక, మరికొన్ని మార్గాల్లో బస్సులు ఎక్కువ అవుతున్నాయని ఏఐ సహాయం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ నిర్ణయించింది. ఏ సమయంలో ఏ డిపోకు ఎన్ని బస్సులు నడపాలో ఏఐ సహాయంతో అధికారులు నిర్ణయించనున్నారు. ఇదేవిధంగా ఏ డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులు ఎక్కువగా సెలవులు తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారనే వివరాలు కూడా రాష్ట్ర స్థాయి అధికారులకు తెలియనుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీని పైలెట్ ప్రాజెక్టుగా మొదట ఆరు డిపోల్లో తెలంగాణ రవాణాశాఖ ప్రారంభించనుంది.