Adilabad : ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత .. లాఠీ ఛార్జి

ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు

Update: 2026-01-03 06:52 GMT

ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. సోయా పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతృత్వంలో రైతులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

సోయా పంట కొనుగోలు చేయాలంటూ...
ఈ సందర్భంగా రైతులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తమను అడ్డుకున్న పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. రంగుమారిన సోయా పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు రైతులపై లాఠీ ఛార్జి చేశారు. రైతులను అరెస్ట్ చేసి బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. మరొకవైపు అసెంబ్లీలో తుమ్మల నాగేశ్వరరావు సోయా పంటకొనుగోలు పై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించామని, రైతుల వద్ద ఉన్న సోయా పంటను కొనుగోలు చేస్తామని చెప్పారు.


Tags:    

Similar News