దమ్మన్నపేటలో ఉద్రిక్తత.. పోడు రైతులకు, పోలీసుల మధ్య

మంచిర్యాల దమ్మన్నపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అటవీప్రాంతంలో ఆదివాసీల పూరిళ్లు తొలగించడంతో పోలీసులతో పోడు రైతులు ఘర్షణకు దిగారు.

Update: 2025-09-13 06:26 GMT

మంచిర్యాల దమ్మన్నపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అటవీప్రాంతంలో ఆదివాసీల పూరిళ్లు తొలగించడంతో పోలీసులతో పోడు రైతులు ఘర్షణకు దిగారు.మహిళలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం చెందిన పోడు రైతులు నిన్న అటవీశాఖ సిబ్బందిపై పోడు రైతుల దాడికి దిగారు. దీంతో మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దాడులు చేయడంతో...
సిబ్బంది కళ్లలో పోడు రైతులు కారం చల్లి అడ్డుకున్నారు. దీంతో ఆదివాసీల ఆక్రమణలు తొలగించేందుకు 300 మంది ఫారెస్ట్ సిబ్బంది, 200 మంది పోలీసులు చేరుకున్నారు. పోడు రైతుల ఆక్రమణలను పోలీసులు తొలగిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు మాత్రం అక్కడకు వచ్చిన పోడు రైతులను అడ్డుకుంటున్నారు.


Tags:    

Similar News