తెలంగాణలో ఊపుతున్న ఒమిక్రాన్, కరోనా

తెలంగాణలో పది ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 94కు చేరుకుంది.

Update: 2022-01-05 02:03 GMT

నూతన సంవత్సర వేడుకల ఎఫెక్ట్ తెలంగాణలో స్పష్టంగా చూపుతుంది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు, సంక్రాంతి ఇలా వరసగ పండగలు వైరస్ వ్యాప్తికి కారణంగా చెబుతున్నారు. తాజాగా తెలంగాణలో పది ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 94కు చేరుకుంది.

రికార్డు స్థాయిలో....
ఇక కరోనా కేసులు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. వెయ్యి దాటడం విశేషం. ఒక్కరోజులోనే 1,052 కేసులు నమోదయ్యాయి. ఇద్దు కరోనాతో మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 6,84,023 మందికి కరోనా సోకింది. 7,75,132 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 4,858 ఉన్నాయి. ఇప్పటి వరకూ 4,033 మంది కరోనా కారణంగా మరణించారు.


Tags:    

Similar News